స్టేట్ న్యూస్

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం: ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సోదరీ సోద రులతో సంప్రదింపులు జరుపుతారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు: వ్యవహారదక్షతతో రాణిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. సోమ, మంగళవారాల్లో పనులు హడావుడిగా సాగు తాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు.

మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు: ఆర్థిక సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీ యులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. స్థిమి తంగా పనులు పూర్తి చేస్తారు. ఇంటి విష యాలపై మరింత శ్రద్థ వహించాలి. వైద్య సేవలు అవసరమవుతాయి. బుధ, గురు వారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదా లకు దిగవద్దు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. విశ్రాంతిలోపం, అకాలభోజనం. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడ తారు. గృహమార్పు అనివార్యం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. అవివాహితులకు శుభయోగం. శుక్ర, శని వారాల్లో పనులు సాగవు. ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. చెల్లింపులు, పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు.

సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: అనుకూలతలు నెలకొంటాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. కొన్ని విష యాలు ఊహించినట్టే జరుగుతాయి. ఆత్మీ యుల సలహా పాటిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. తలపెట్టిన పనులు పూర్తి చేయగల్గుతారు. పిల్లల విజయం ఉత్సాహాన్ని స్తుంది. శనివారం నాడు నగదు, వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ధార్మిక విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.

కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు: భేషజాలకు పోవద్దు. సామ రస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందర పాటు నిర్ణయాలు తగవు. ఖర్చులు అంచ నాలను మించుతాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఆలో చనల్లో మార్పు వస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు చేజారినా ఒకం దుకు మంచిదే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది.

తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు: ఈ వారం కలిసివచ్చే సమ యం. కార్యసాధనలో సఫలీకృతులవుతారు. రావలసిన ధనం అందుతుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. ఖర్చులు అధికం, ప్రయో జనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థంలో మెలకువ వహిం చండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.

వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ: వ్యవహారాలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. మీ ప్రతిపాద నలకు స్పందన ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పనుల్లో ఒత్తిడి, చికా కులు అధికం. బంధువులతో స్పర్థలు తలెత్తు తాయి. సన్నిహితుల సలహా పాటిస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఆహ్వానం అందు కుంటారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి.

ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం: ప్రణాళికలు వేసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. కొత్త పరిచయాలేర్పడ తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మంగళ, బుధవారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నిలి పివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయు లతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు: ప్రతికూలతలెదురవుతాయి. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవు తుంది. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఆది, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం

కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు: ఆదాయం బాగుంటుంది. రుణ సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచ నలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలకు అయిన వారి ప్రోత్సాహం ఉంది. అవకాశా లను తక్షణం వినియోగించుకోండి. పరిచయ స్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆది, సోమ వారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆశావహ దృక్పథంతో మెలగండి. పత్రాలు అందుకుంటారు. అవివాహితులకు శుభయోగం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.

మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి: ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. బుధ, గురువారాల్లో ప్రము ఖుల సందర్శనం వీలుపడదు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇంటి విషయాలపై శ్రద్థ వహించండి.